Thu Jan 29 2026 15:25:29 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. కుక్క నోటిలో బాలుడి తల
ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం మన్సూరాబాద్‌లోని సహారా ఎస్టేట్స్ రోడ్డులో ఓ పాల బూత్‌లో..

హైదరాబాద్ : ఓ కుక్క నోటిలో బాలుడి తలతో తిరగడం కలకలం రేపింది. అది చూసిన స్థానికులు కంగారుపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో జరిగింది. వనస్థలిపురం లోని సహారా ఎస్టేట్స్ రోడ్డులో ఈ దారుణ ఘటన జరిగింది. గుర్తు తెలియని బాలుడి తలను శునకం నోటిలో చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి విచారణ చేశారు. వెంటనే డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపి, ఆధారాలను సేకరించారు.
వివరాలను పరిశీలిస్తే.. ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి ఆదివారం ఉదయం మన్సూరాబాద్‌లోని సహారా ఎస్టేట్స్ రోడ్డులో ఓ పాల బూత్‌లో కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో గుర్తు తెలియని ఓ బాలుడి తలను కుక్క నోట్లో పట్టుకొని వెళ్లడం గమనించాడు. వెంటనే కుక్కను వెంబడించగా, అది ఓ ప్రహరీ గోడ సమీపంలోని పొదల్లో వదిలేసి వెళ్లిపోయింది. పోలీసులకు సమాచారమివ్వగా.. బాలుడి తలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలుడికి సుమారు 10 సంవత్సరాలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు పోలీసులు. ఆ బాలుడు ఎవరు ? ఎలా చనిపోయాడు ? ఎవరైనా హత్య చేశారా ? క్షుద్రపూజలకు బలి ఇచ్చారా ? శునకానికి ఆ తల ఎక్కడ దొరికింది? తదితర విషయాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.
Next Story

