Thu Mar 27 2025 04:10:34 GMT+0000 (Coordinated Universal Time)
రంగన్న మృతదేహానికి రీ పోస్టు మార్టం
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి రంగన్న మృతదేహానికి వైద్యులు రీపోస్టుమార్టం చేశారు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి రంగన్న మృతదేహానికి వైద్యులు రీపోస్టుమార్టం చేశారు. సిట్, రెవెన్యూ అధికారుల బృందం పర్యవేక్షణలో ఈ రీపోస్టు మార్టం నిర్వహించారు. రంగన్న మృతిపై ఆయన భార్య అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు ఎస్పీ అశోక్ కుమార్ సయితం ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు.
వివేకాహత్య కేసులో...
దీంతో రంగన్న మృతిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో కడప నుంచి వచ్చిన వైద్యుల బృందం రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించింది. రంగన మృతదేహం నుంచి ఆనవాళ్లు సేకరించారు. వైఎస్ వివేకా ఇంట్లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న రంగన్న మృతితో కీలకమైన సాక్షిని కోల్పోయినట్లయింది.
Next Story