Tue Jan 20 2026 12:21:21 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. సొంత ఆస్పత్రిలోనే వైద్య దంపతులు సజీవదహనం
ఆస్పత్రిని ఏర్పాటు చేసిన దంపతులు డాక్టర్ వికాస్ హజ్ర, డాక్టర్ ప్రేమ హజ్ర కూడా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడవడం..

ఝార్ఖండ్ రాష్ట్రంలోని దన్ బాద్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. హజ్ర హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరగడంతో.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వైద్య దంపతులు సజీవదహనమయ్యారు. ఆస్పత్రిని ఏర్పాటు చేసిన దంపతులు డాక్టర్ వికాస్ హజ్ర, డాక్టర్ ప్రేమ హజ్ర కూడా మంటల్లో చిక్కుకుని ప్రాణాలు విడవడం కలచివేసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా హాస్పిటల్ భవనం రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి.
క్షణాల్లో మంటలు హాస్పిటల్ భవనాన్ని చుట్టేయడంతో అదే అంతస్తులో నిద్రిస్తున్న వైద్య దంపతులు, ఇతర ఉద్యోగులు మంటల్లో చిక్కుకున్నారు. వారంతా బయటపడలేక.. పొగకు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు వెల్లడించారు. 9 మందిని రక్షించి పాటలీపుత్ర ఆసుపత్రికి తరలించామన్నారు. కాగా.. మంటలు అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత.. ఆస్పత్రిని పరిశీలించిన అగ్నిమాపక సిబ్బంది.. లోపల అగ్నిప్రమాద నివారణకు సరైన ఏర్పాట్లు లేవని తెలిపారు.
Next Story

