Sun Mar 08 2026 07:12:02 GMT+0530 (India Standard Time)
రాజమండ్రిలో గన్ కలకలం
తూర్పుగోదావరి జిల్లాలో తుపాకీ దొరకడం కలకలం రేపింది. పోలీసుల తనిఖీల్లో గన్ బయటపడింది

తూర్పుగోదావరి జిల్లాలో తుపాకీ దొరకడం కలకలం రేపింది. పోలీసుల తనిఖీల్లో గన్ బయటపడింది. శ్రీనివాస్ అనే యువకుడి నుంచి పోలీసులు గన్ ను స్వాధీనం చేసుకున్నారు. కొత్తపేటకు చెందిన శ్రీనివాస్ గన్ తో బెదిరించి దందాలు చేసేందుకు శ్రీనివాస్ ఈ గన్ ను తెప్పించినట్లు తెలుస్తోంది.
బెదిరించడానికే...
విజయనగరం జిల్లాలో ఉన్న తన స్నేహితుడి నుంచి శ్రీనివాస్ గన్ తీసుకువచ్చినట్లు పోలీసు దర్యాప్తులో వెల్లడయింది. గన్ ను ట్రయల్ వేయాలని శ్రీనివాస్ బయటకు తీసుకురాగా పోలీసుల తనిఖీల్లో అది బయటపడింది. అమెరికా మేడ్ గన్ గా పోలీసులు గుర్తించారు. గన్ తో పాటు ఏడు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
Next Story

