Sat Mar 07 2026 18:01:36 GMT+0530 (India Standard Time)
సింగర్ హరిణి ఫ్యామిలీ మిస్సింగ్.. తండ్రి మృతి
ప్రముఖ గాయని హరిణి కుటుంబం అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ లో సంచలనం కలిగిస్తుంది.

ప్రముఖ గాయని హరిణి కుటుంబం అదృశ్యమైన సంఘటన హైదరాబాద్ లో సంచలనం కలిగిస్తుంది. సింగర్ గా హరిణి అందరికీ సుపరిచితురాలు. ఆమె కుటుంబం ఎస్ఆర్ నగర్ లో ఉంటుంది. అయితే వారం రోజుల క్రితం సింగర్ హరిణి కుటుంబం మిస్ అయినట్లు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
బెంగళూరులో....
మరోవైపు హరిణి తండ్రి ఏకే రావు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని బెంగళూరులోని రైల్వే ట్రాక్ పై పోలీసులు గుర్తించారు. హరిణి కుటుంబం అదృశ్యం కావడం, ఆమె తండ్రి ఏకేరావు మృతి చెందడం మిస్టరీగా మారింది. దీనిపై కారణాలను కనుగునేందుకు, హరిణి కుటుంబం ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు.
Next Story

