Mon Mar 16 2026 01:11:41 GMT+0530 (India Standard Time)
ఇటలీలో కర్నూలు విద్యార్థి మృతి
ఇటలీలో కర్నూలుకు చెందిన విద్యార్థి దిలీప్ మృతి చెందాడు. అక్కడ మిలాన్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ ప్రవేశం పొంది వెళ్లాడు.

ఇటలీలో కర్నూలు జిల్లాకు చెందిన విద్యార్థి దిలీప్ మృతి చెందాడు. అక్కడ మిలాన్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ ప్రవేశం పొంది వెళ్లాడు. ఇటలీకి గత సెప్టంబరు నెలలోనే చదువు కోసం వెళ్లాడు. అయితే ఎంఎంస్సీ అగ్రికల్చర్ కోర్సు దిలీప్ పూర్తి చేశారు. ఈ సంతోషంలో దిలీప్ మాంటెరుస్సో బీచ్ కు వెళ్లాడు.
అలలు లాక్కుని వెళ్లడంతో...
అయితే బీచ్ లో ఉండగానే దిలీప్ ను ఒడ్డు వరకూ వచ్చిన అలలు ఆ యువకుడిని సముద్రంలోకి లాక్కెళ్లాయి. అయితే దిలీప్ ను రక్షించేందుకు కోస్ట్ గార్డ్ లు ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు దిలీప్ మృతదేహం లభించింది. కర్నూలు బాలాజీనగర్ లో ఉంటున్న చిలుమూరు శ్రీనివాసరావు కుమారుడు దిలీప్, యువకుడి మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Next Story

