Fri Dec 05 2025 13:21:57 GMT+0000 (Coordinated Universal Time)
శ్రద్ధావాకర్ తరహాలో.. ఢిల్లీలో మరో మహిళ హత్య
ఆమెను తన బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ అమీన్ పూనావాలా హతమార్చిన తీరు గుర్తొస్తే.. ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుంది.

శ్రద్ధావాకర్ హత్యోదంతం దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో కలకలం రేపిందో ఇప్పటికీ మరచిపోలేం. ఆమెను తన బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ అమీన్ పూనావాలా హతమార్చిన తీరు గుర్తొస్తే.. ఎవరికైనా ఒళ్లు గగుర్పొడుస్తుందో. శ్రద్ధ వాకర్ హత్యోదంతం తర్వాత.. ఆ స్ఫూర్తితోనే దేశంలో కొందరు యువకులు తమ ప్రియురాళ్లను దారుణంగా హతమార్చారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి ఢిల్లీలోనే వెలుగుచూసింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దొరికిన కవర్లలో మహిళ శరీర భాగాలు దర్శనమిచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యమునా ఖాదర్ ప్రాంతం గీతా కాలనీ ఫ్లై ఓవర్ సమీపంలో మహిళ శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపగా.. హత్యకు గురైన మహిళ వయసు సుమారు 35-40 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిసినట్లు పోలీస్ కమిషనర్ సాగర్ సింగ్ కల్సి తెలిపారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ఢిల్లీలో ఒకదాని తర్వాత మరొకటి మహిళల దారుణ హత్యలు ఎందుకు జరుగుతున్నాయంటూ పోలీసులను ప్రశ్నించారు. ఈ మేరకు నోటీసులు పంపారు. మరోవైపు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకుని, నిందితుల కోసం వెతికే పనిలో పడ్డారు.
Next Story

