Mon Oct 14 2024 06:03:35 GMT+0000 (Coordinated Universal Time)
Delhi : ఢిల్లీలో డ్రగ్స్ కలకలం.. రెండు వేల కోట్ల విలువైన కొకైన్ సీజ్
ఢిల్లీ పోలీసులు అతి పెద్ద డ్రగ్స్ మాఫియాను అరెస్ట్ చేశారు. 2వేల కోట్ల విలుైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు
ఢిల్లీ పోలీసులు అతి పెద్ద డ్రగ్స్ మాఫియాను అరెస్ట్ చేశారు. ఢిల్లీకి వచ్చిన ఐదు వందల కేజీలకు పైగా ఉన్న ఈ డ్రగ్స్ విలువ బయట మార్కెట్ లో రెండు వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద స్థాయిలో ఢిల్లీలో డ్రగ్స్ పట్టుబడటం ఇదే ప్రప్రధమని ఢిల్లీ పోలీసులు కూడా తెలుపుతుండటం విశేషం.
వెనక ఎవరన్నది?
అయితే ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ లో నలుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేయడానికి కోర్టులో ప్రవేశ పెట్టడానికి పోలీసులు తమ కస్టడీకి కోరనున్నారు. ఈ పెద్ద మొత్తంలో డ్రగ్స్ ఆప్ఫనిస్థాన్ నుంచి వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ప్రాధమికంగా అనుమానం మాత్రమే. దీంతో పాటు ఈ డ్రగ్స్ ను పంపింది ఎవరు? ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ కింగ్ ఎవరు? ఇక్కడ ఎవరికి అన్న దానిపై టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు ఫోన్లు సీజ్ చేసినట్లు తెలిసింది.
Next Story