Fri Dec 05 2025 16:20:10 GMT+0000 (Coordinated Universal Time)
35కు పెరిగిన మృతుల సంఖ్య
ఇండోర్ నగరంలో బాలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది

ఇండోర్ నగరంలో బాలేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 35కు చేరింది. బావి పై కప్పు కూలడంతో నిన్న ఆలయానికి వచ్చిన భక్తులు ఎక్కువ మంది అందులో పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించినా మృతుల సంఖ్య పెరగడం ఆందోలన కల్గిస్తుంది. 35 మృతదేహాలను బావి నుంచి వెలికి తీయడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.
18 మంది సేఫ్...
ఈ ఘటనలో సహాయక సిబ్బంది పద్దెనిమిది మందిని రక్షించారు. పదహారు మంది గాయపడటంతో వారికి ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బావిలో ఇంకా మృతదేహాలు ఏవైనా ఉన్నాయా? అని సహాయక సిబ్బంది వెదుకుతున్నారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. ప్రభుత్వం ఆదేశించిన విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయన్నది చూడాల్సి ఉంది.
Next Story

