Wed Mar 18 2026 03:31:22 GMT+0530 (India Standard Time)
రాజస్థాన్ ప్రమాదంలో పదికి చేరిన మృతుల సంఖ్య
రాజస్థాన్ పాఠశాల భవనం పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది.

రాజస్థాన్ పాఠశాల భవనం పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య పదికి చేరింది. రాజస్థాన్ లోని ఝలావర్ లో ప్రార్థనల సమయంలో ఒక్కసారిగా పాఠశాల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కేడే నలుగురు చిన్నారులు మరణించారు. అనేక మంది శిధిలాల కింద చిక్కుకున్నారు. పాఠశాల శిధిలాల కింద దాదాపు డెబ్భయి మంది చిన్నారులు చిక్కుకోవడంతో వారిని బయటకు తీశారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ
అయితే వెంటనే స్థానికులు అందించిన సమాచారంతో సహాయక బృందాలు వెంటనే అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నలుగురు మృతదేహాలను శిధిలాల నుంచి వెలికి తీశారు. ఈప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఆరుగురు చనిపోయారు. పదిహేడు మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై రాజస్థాన్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.
Next Story

