Mon Sep 09 2024 12:10:36 GMT+0000 (Coordinated Universal Time)
Canada : కెనడాాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయుల మృతి
కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్ కు చెందిన దంపతులు మరణించిన ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది
కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత్ కు చెందిన దంపతులు మరణించిన ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఇండియాకు చెందిన మణివణ్ణన్, మహలక్ష్మిలు కెనడాలోని ఎజాక్స్ లో ఉంటున్న తమ మనవడిని చూసేందుకు ఇండియా నుంచి వెళ్లారు. అయితే మనవడితో కలసి కొద్ది రోజులు గడిపిన వారు కుటుంబ సభ్యులతో కలసి కారులో బయటకు వచ్చారు. అయితే బోమన్విల్లేలో మద్యం దుకాణంలో చోరీ చేసిన ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వెంటపడగా వారు హైవేపై రాంగ్ రూట్ లో తప్పించుకునేందుకు ప్రయత్నించారు.
నిందితుడు కూడా...
రాంగ్ రూట్ లో వచ్చిన నిందితుల వాహనం అనేక వాహనాలను ఢీకొట్టింది. ఢీకొట్టిన వాహనంలో వీరి వాహనం కూడా ఉది. ఈ ఘటనలో నిందితుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరొకరు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టాడుతున్నాడు. ఈ ప్రమాదంలో మణివణ్ణన్, మహాలక్ష్మి, మనవడు మరణించగడా, మరో ఇద్దరు కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైవే పై ఈ ప్రమాదం జరగడంతో వెంటనే పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు.
Next Story