Fri Dec 05 2025 19:51:23 GMT+0000 (Coordinated Universal Time)
ఉన్నావ్ లో మరో దారుణం.. దళిత యువతి మెడలు విరిచి, అత్యంత కిరాతకంగా..
దుప్పటిలో చుట్టి సెప్టిక్ ట్యాంక్ లో పడేసిన ఆ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కు పంపగా విస్తుపోయే నిజాలు తెలిశాయి. యువతి మెడల

ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ లో మరో దారుణం వెలుగులోకొచ్చింది. 22 ఏళ్ల దళిత యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. దుండగులు యువతి గొంతు నులిమి, మెడలి విరిచేసి దారుణంగా చంపేశారు. రెండు నెలల క్రితం కనిపించకుండా పోయిన యువతి నిన్న శవమై కనిపించింది. చాలా ఆలస్యంగా ఈ ఘటన వెలుగుచూసింది. కాగా.. యువతి మృతదేహం యూపీ మాజీమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అయిన ఫతే బహదూర్ సింగ్ కుమారుడు రాజోల్ సింగ్ కు చెందిన ఓ ఆశ్రమంలో లభ్యమైంది.
Also Read : ఫిబ్రవరి 28 నుంచి స్కూళ్లు పునః ప్రారంభం
డిసెంబర్ 8వ తేదీన తమ బిడ్డ కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసినా.. వారు స్పందించలేదని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మీ అమ్మాయి ఎవరితోనో పారిపోయి ఉంటుంది.. వస్తుందిలే అని ఎగతాళి చేశారని, ఎస్పీని కూడా కలవనివ్వలేదని వాపోయారు. తల్లిదండ్రుల ఆరోపణలను పోలీసులు ఖండించారు. దుపట్టిలో చుట్టి సెప్టిక్ ట్యాంక్ లో పడేసిన ఆ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కు పంపగా విస్తుపోయే నిజాలు తెలిశాయి. యువతి మెడలు విరిచేయడంతో పాటు.. తలపై రెండు గాయాలున్నట్లు తేలింది. ఎస్ఎస్పీ శశి శేఖర్ సింగ్ మాట్లాడుతూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతి మృతదేహం లభ్యమైన ఆశ్రమం.. మాజీ మంత్రి కుమారుడు రాజోల్ సింగ్ ది కావడంతో.. అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. కాగా యువతిని ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? అత్యాచారం జరిగిందా? అన్న వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాగా యువతిపై పదే పదే అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది.
News Summary - Dalit Girl Buried in Ex-SP Minister's Plot Strangled, Reveals Post-mortem
Next Story

