Sun Apr 12 2026 08:34:52 GMT+0530 (India Standard Time)
Mumbai : గాలివానకు కూలిన హోర్డింగ్.. 14 మంది మృతి
ముంబయి నగరంలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ హోర్డింగ్ కూలి పథ్నాలుగు మంది మృతి చెందారు

ముంబయి నగరంలో గాలివాన బీభత్సం సృష్టించిది. భారీ హోర్డింగ్ కూలి పథ్నాలుగు మంది మృతి చెందారు. మరో 70 మందికి గాయాలయ్యాయని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ముంబయి నగరంలో గాలి వాన బీభీతత్సానికి పథ్నాలుగు మంది మరణించిన ఘటన విషాదం నింపింది. అయితే మృతులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు.ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
హోర్డింగ్ పడి...
గాలివాన రావడంతో హోర్డింగ్ వర్షానికి తలదాచుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు అక్కడ ఉన్నారు. దీంతో గాలివాన దెబ్బకు హోర్డింగ్ కూలి పడటంతో ప్రజలు అక్కడ వేచి ఉన్న వారు మరణించారు. పోలీసుల సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు.
Next Story

