సద్గురు డీప్ ఫేక్ వీడియో 3.75 కోట్లు లాగేశారు
సద్గురు జగ్గీ వాసుదేవ్ డీప్ ఫేక్ వీడియోను చూపించి ఓ భక్తురాలిని సైబర్ నేరగాళ్లు దోపిడీ చేశారు.

సద్గురు జగ్గీ వాసుదేవ్ డీప్ ఫేక్ వీడియోను చూపించి ఓ భక్తురాలిని సైబర్ నేరగాళ్లు దోపిడీ చేశారు. ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో ఆమెతో ఏకంగా 3 కోట్ల 75 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించి, ఆ డబ్బులను కొట్టేశారు. డబ్బంతా ఆమె ఐదు నెలల కిందే నేరగాళ్లకు ట్రాన్స్ఫర్ చేసినందున ఇప్పుడేం చేయలేమని పోలీసులు చెబుతున్నారు. యూకే నుంచి వలీద్ అనే వ్యక్తి ఫోన్ చేసి మిర్రాక్స్ అనే యాప్‌ను ఆ మహిళతో డౌన్లోడ్ చేయించాడు. ఆపై ఆన్లైన్ ట్రేడింగ్ ఎలా చేయాలో కూడా జూమ్ యాప్ ద్వారా ఆమెకు ట్రైనింగ్ ఇచ్చాడు. అతడు లేనప్పుడు మైఖేల్ అనే మరో వ్యక్తికూడా ట్రేడింగ్‌పై శిక్షణ ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 23 మధ్య ఆ మహిళతో ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లోకి కోట్ల రూపాయలు బదిలీ చేయించారు. కొద్దిరోజుల్లో డబ్బులు పెరిగినట్లు యాప్‌లో చూపించడంతో బాధితురాలు విత్‌డ్రా చేసేందుకు యత్నించారు. కానీ వీలు పడకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు.

