Sat Sep 14 2024 10:16:42 GMT+0000 (Coordinated Universal Time)
ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం
ముంబయి విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం డ్రగ్స్ కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఎంత పకడ్బందీ చర్యలు తీసుకున్నా ఇక్కడికి డ్రగ్స్ వచ్చిపడుతున్నాయి. తాజాగా ముంబయి విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 8,586 గ్రాముల హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనివిలువ అరవై కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మహిళ నుంచి....
జింబాబ్వే నుంచి ఒక మహిళ ముంబయి ఎయిర్ పోర్టుకు వచ్చింది. హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ తో పాటు ఫైల్ ఫోల్డర్ లో దాచి ఉంచినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. కస్టమ్స్ అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. తనకు ఏమాత్రం సంబంధం లేదని ఆమె చెబుతుంది. అయితే కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story