Fri Mar 20 2026 07:47:15 GMT+0530 (India Standard Time)
శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. సుధీర్ కుమార్ అనే ప్రయాణికుడి వద్ద నుంచి 47 లక్షల విలువ చేసే 87 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది.
పేస్టుగా మార్చి...
సుధీర్ కుమార్ బంగారన్ని పేస్టుగా మార్చి అనుమానం రాకుండా టీ షర్ట్ వెనక భాగాన పూసుకుని తరలించేందుకు సిద్ధమయ్యాడు. అయితే కస్టమ్స్ అధికారుల విచారణలో ఈ విషయం బయటపడింది. దీంతో ప్రయాణికుడిని అరెస్ట్ చేసి కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నారు.
Next Story

