Fri Oct 04 2024 06:14:13 GMT+0000 (Coordinated Universal Time)
కడుపులో 1.51 కోట్ల విలువైన బంగారం
. బెంగళూరు ఎయిర్ పోర్టులో స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
బంగారం ఇప్పుడు పెట్టుబడిగా మారింది. ప్రధాన ఆదాయవనరుగా మారింది. బంగారాన్ని స్మగ్లింగ్ చేసే ముఠా కూడా కొత్త పుంతలు తొక్కుతున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. కడుపులో 3.1 కేజీల బంగారాన్ని దాచిపెట్టుకుని ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.
ముఠాగా ఏర్పడి.....
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో 1.53 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని కరిగించి క్యాప్సూల్స్ లో నింపి వాటిని మింగి పది మంది ప్రయాణికులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారిని పట్టుకుని కడుపులో దాచిన బంగారాన్ని వెలికి తీశారు. పది మందిని అరెస్ట్ చేశారు. దీని వెనక పెద్ద ముఠా ఉందని గుర్తించారు. ముఠా కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story