Fri Oct 11 2024 07:51:00 GMT+0000 (Coordinated Universal Time)
దారుణం.. తల్లీ - కుమార్తె గొంతు కోసి
రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైం రేటు రోజురోజుకూ పెరిగిపోతుంది. అత్యాచారాలు, కిడ్నాప్ లు, దొంగతనాలు పెరిగిపోతున్నాయి
రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రైం రేటు రోజురోజుకూ పెరిగిపోతుంది. ఆడపిల్లలపై అత్యాచారాలు, చిన్న పిల్లల కిడ్నాప్ లు, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, హత్యలు ఇలా ఏదోక రూపంలో ఏదో ప్రాంతంలో క్రైం జరుగుతూనే ఉంటుంది. తాజాగా తల్లీ - కుమార్తె దారుణ హత్యకు గురైన సంఘటన ప్రకాశం జిల్లా టంగుటూరులో వెలుగుచూసింది. వివరాలను పరిశీలిస్తే.. టంగుటూరు పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో జరిగిందీ ఘటన. సింగరాయకొండ రోడ్డులో ఆర్ . కె జ్యూయలర్స్ పేరిట నగల వ్యాపారం చేస్తున్న జలదంకి రవికిషోర్ భార్య శ్రీదేవి (43), అతని కుమార్తె వెంకట లేఖన (21)లను గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసం హతమార్చారు. ఆ సమయంలో ఇంట్లో రవికిషోర్ లేకపోవడంతో విషయం ఆలస్యంగా తెలిసింది.
వివిధ కోణాల్లో....
రాత్రికి షాపు మూసివేసి ఇంటికొచ్చిన రవికిషోర్ కి భార్య, కుమార్తె రక్తపు మడుగులో అచేతనంగా కనిపించారు. వెంటనే చుట్టుపక్కల వారికి విషయం తెలియగా.. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్.ఐ. నాయబ్ రసూల్, సింగరాయకొండ సీఐ ఎం.లక్ష్మణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు నేతృత్వంలో క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఇంతటి దారుణం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందన్న కోణంలో కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నారు.
Next Story