Thu Dec 18 2025 23:02:27 GMT+0000 (Coordinated Universal Time)
శోభనం గదిలో నవదంపతులు మృతి
వివరాల్లోకి వెళ్తే.. 22 ఏళ్ల ప్రతాప్ యాదవ్ కు 20 ఏళ్ల పుష్పతో పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లితంతు పూర్తయ్యాక.. అదే..

ఎన్నో ఆశలు, ఇంకెన్నో కలలతో పెళ్లి అనే బంధంతో కొత్తజీవితంలోకి అడుగు పెట్టిన ఆ దంపతులకు తొలిరాత్రే ఆఖరి రాత్రయింది. ఎవరూ ఊహించని విధంగా శోభనం గదిలో నవదంపతులు విగతజీవులుగా కనిపించారు. కొత్త దంపతులతో కళకళలాడాల్సిన ఇల్లు.. శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. మూడుముళ్లతో ఒక్కటై గంటలు గడవకుండానే.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని బహ్రైచ్ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. 22 ఏళ్ల ప్రతాప్ యాదవ్ కు 20 ఏళ్ల పుష్పతో పెద్దలు వివాహం జరిపించారు. పెళ్లితంతు పూర్తయ్యాక.. అదే రోజు రాత్రి శోభనానికి ముహూర్తం పెట్టారు. నవ దంపతులను గదిలోకి పంపారు. అంతా సవ్యంగా సాగింది. మరుసటి రోజున చూసేసరికి ఇద్దరూ మంచంపై విగతజీవులుగా కనిపించారు. వాళ్లిద్దరిని చూసిన బంధువులు షాకయ్యారు. ఏమైందో అర్థంకాలేదు. పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టమ్ కు పంపారు. వైద్యులు వారిద్దరి మరణానికి కారణం గుండెపోటుగా తేల్చారు. ఇద్దరికీ ఒకేసారి దహనసంస్కారాలు నిర్వహించారు. మే 30న జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు సైతం షాకవుతున్నారు.
Next Story

