Thu Sep 12 2024 13:16:06 GMT+0000 (Coordinated Universal Time)
లోన్ యాప్ వేధింపులకు దంపతులు బలి.. సీఎం కీలక ఆదేశాలు
రాజమండ్రిలోని సాయికృష్ణ రివ్యూ లాడ్జిలో పురుగులు ముందు తాగి ఆత్మహత్య కు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమను..
ఆన్ లైన్ లో అడిగినవారికల్లా లోన్లు ఇచ్చి.. ఆ తర్వాత ఇచ్చిన లోన్ సమయానికి కట్టకపోతే బాధితులను బెదిరించి, భయపెడుతున్నారు. ఫలితంగా బాధిత వ్యక్తులు బలన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలెన్నో చోటుచేసుకున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో లోన్ యాప్ వేధింపులు భరించలేక దంపతులు బలవన్మరణాలకు పాల్పడ్డాడు. ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
రాజమండ్రిలోని ఆనందనగర్ లో కొల్లు దుర్గారావు (32), లక్ష్మి (28) దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. దుర్గారావు పెయింటర్ గా పనిచేస్తుండగా.. లక్ష్మి టైలరింగ్ చేస్తోంది. కుటుంబ అవసరాల నిమిత్తం ఇటీవల ఆన్లైన్ యాప్ లో రూ.50,000 లోన్ తీసుకున్నారు. లోన్ సమయానికి చెల్లించలేకపోవడంతో.. నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఫేస్ మార్ఫింగ్ చేసి ఆన్ లైన్లో మీ ఫొటోలను న్యూడ్ ఫొటోలుగా పెడతామని బెదిరించి, మానసికంగా హింసించడంతో తీవ్ర మనస్తాపానికి గురై దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
రాజమండ్రిలోని సాయికృష్ణ రివ్యూ లాడ్జిలో పురుగులు ముందు తాగి ఆత్మహత్య కు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమను లోన్ యాప్ సిబ్బంది తీవ్రంగా వేదిస్తున్నారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు దుర్గారావు తన సోదరుడుకి ఫోన్ చేసి తెలిపాడు. విషయం తెలుసుకున్న సోదరుడు హుటాహుటిన సాయి కృష్ణ లాడ్జ్ వద్దకు చేరుకుని పురుగుల మందు సేవించిన దంపతులను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దుర్గారావు, భార్య లక్మీ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతితో పిల్లలు నాగసాయి (4), లిఖిత శ్రీ (2) అనాధలయ్యారు.
స్పందించిన సీఎం జగన్
లోన్ యాప్ వేధింపులకు దంపతులు బలైన ఘటనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. తల్లిదండ్రుల మృతితో అనాధలైన ఇద్దరు చిన్నారుల సంరక్షణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చిన్నారులకు తక్షణమే చెరొక రూ.5 లక్షలు (రూ.10 లక్షలు) ఆర్థిక సహాయం అందించాలని సీఎం జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే.. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేని లోన్ యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Next Story