Sun Feb 01 2026 19:46:31 GMT+0000 (Coordinated Universal Time)
అతి వేగమే ఆమె ప్రాణం తీసింది
కాంగ్రెస్ ముఖ్యనేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎయిర్పోర్టుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

కాంగ్రెస్ ముఖ్యనేత ఫిరోజ్ ఖాన్ కుమార్తె రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఎయిర్పోర్టుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఫిరోజ్ఖాన కుమార్తె తానియా ఈరోజు తెల్లవారుజామున తన స్నేహితులతో కలసి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళుతున్నారు. స్నేహితుడిని విమానాశ్రయంలో డ్రాప్ చేసి తిరిగి వస్తుండగా రోడ్డు డివైడర్ ను ఢీకొని ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా అక్కడికక్కడే మరణించారు. అతి వేగమే కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు.
మరో ముగ్గురు....
కారులో ఉన్న మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలికి వెళ్లి క్షతగ్రాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. తానియా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
Next Story

