Wed Mar 18 2026 03:31:56 GMT+0530 (India Standard Time)
Breaking : విజయవాడ లో బ్రేకు ఫెయిల్ అయి ప్లాట్‌ఫారంపైకి బస్సు... ఇద్దరు మృతి
బ్రేకులు ఫెయిల్ అయినా ఆర్టీసీ బస్సు బస్టాండ్ లోకి దూసుకు రావడంతో కండక్టర్, ఒక ప్రయాణికురాలు మృతి చెందారు

ఆర్టీసీ బస్సు విజయవాడలో బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అయినా ఆర్టీసీ బస్సు బస్టాండ్ లోకి దూసుకు రావడంతో కండక్టర్, ఒక ప్రయాణికురాలు మృతి చెందారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ లో ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన ఏసీ బస్సు ఈ ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్టాండ్ ప్రయాణికులతో రద్దీ గా ఉంది.
విజయవాడ బస్టాండ్‌లో....
డిపో నుంచి ఆర్టీసీ బస్టాండ్ లోకి వస్తున్న సందర్భంలో వేగంగా వచ్చి బస్టాండ్ లోని ప్లాట్ఫారం పైకి రావడంతో ఇద్దరు మరణించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బస్సు బ్రేకులు ఫెయిల్ అయినందునే ప్లాట్‌ఫారంపైకి దూసుకువచ్చిందా? మరే ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్న దానిపై విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story

