Wed Mar 18 2026 23:19:46 GMT+0530 (India Standard Time)
ఏడుగంటలుగా విచారణ
సినీ హీరో నవదీప్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏడు గంటలుగా విచారిస్తున్నారు

సినీ హీరో నవదీప్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏడు గంటలుగా విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఆయన నిందితుడుగా ఉన్నారు. అయితే నవదీప్‌కు డ్రగ్ ప్లెడ్లర్స్ తో సంబంధాలున్నాయని, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారన్న దానిపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. నవదీప్ జరిపిన ఆర్థిక లావాదేవీలపై విచారణ జరుపుతున్నారు.
ఆర్థిక లావాదేవీలపై...
ముగ్గురు నైజీరియన్లతో నవదీప్‌కు సత్సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. బ్యాంక్ వివరాలు, ఆర్థిక వివరాలను కూడా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్ నిందితుడిగా ఇటీవల చేర్చడంతో పోలీసులు సయితం విచారించారు. గతంలోనూ నవదీప్ విచారణను ఎదుర్కొన్నారు.
Next Story

