Tue Jan 27 2026 14:14:08 GMT+0000 (Coordinated Universal Time)
కారుతో ఢీకొట్టి స్నేహితుడిన చంపాడు.. లైటర్ కోసం?
సిగరెట్ లైటర్ కోసం గొడవతో ఘర్షణకు దారితి స్నేహితుడిని కారుతో ఢీకొట్టి హతమార్చిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది

సిగరెట్ లైటర్ కోసం గొడవతో ఘర్షణకు దారితి స్నేహితుడిని కారుతో ఢీకొట్టి హతమార్చిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది. కర్ణాటకలోని కమ్మసంద్ర గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కారు డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డైన దృశ్యాలు హత్య జరిగిన తీరును కళ్లకు కట్టినట్లు చెబుతున్ాయి. కమ్మసంద్రలో క్రికెట్ పోటీ నిర్వహించారు. ఈ పోటీలకు వెళ్లిన స్నేహితులు ప్రశాంత్, రోషన్ వెళ్లారు. అయితే అయితే ఆట ముగిశాక ఇద్దరు స్నేహితులు ఒక దగ్గర మద్యం సేవిస్తుండగా, సిగరెట్ లైటర్ విషయంలో గొడవ పడ్డారు. గొడవ ముదరడంతో బీర్ బాటిళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
మద్యం తాగి...
ఈ ఘటనలో రోషన్ హెగ్డే నాలుకకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే అనంతరం రోషన్ తన కారులో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. కారు డోరు పట్టుకొని అడ్డగించడానికి ప్రశాంత్ ప్రయత్నించాడు. దీంతో ప్రశాంత్‌ను కారుతో ఈడ్చుకెళ్లి వేగంగా చెట్టుకు రోషన్ ఢీకొట్టాడు.ఈ ఘటనలో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రశాంత్ మృతి చెందాడు. ఈ ఘటనలో గాయాలు కావడంతో రోషన్ ను ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు చేర్చి పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

