Fri Dec 05 2025 14:36:37 GMT+0000 (Coordinated Universal Time)
Jony Master : నేటితో ముగియనున్న జానీ మాస్టర్ కస్టడీ
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసు కస్టడీ గడువు నేటితో ముగియనుంది

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసు కస్టడీ గడువు నేటితో ముగియనుంది. అత్యాచారం కేసులో జానీ మాస్టర్ ను నాలుగు రోజుల పోలీసుల కస్టడీకి అప్పగించిన నేపథ్యంలో ఆయనను విచారణ చేశారు. ఈరోజు సాయంత్రం ఆయనను తిరిగి జైలులోకి ప్రవేశపెట్టనున్నారు. కాకుంటే నాలుగు రోజుల కస్టడీలో జానీ మాస్టర్ ఎలాంటి సమాధానాలు చెప్పలేదని తెలిసింది. తాను ఎవరిపైనా అత్యాచారం చేయలేదని, తనపై కావాలని కొందరు ఆరోపణలు చేశారని, కొందరి కుట్ర కారణంగానే తాను బలయిపోయానని జానీ మాస్టర్ పోలీసులకు వివరించినట్లు తెలిసింది.
ఫిలింఛాంబర్ కు ఫిర్యాదు...
మరోవైపు జానీ మాస్టర్ సతీమణి సుమలత ఫిలింఛాంబర్ కు ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం తన భర్త జానీ మాస్టర్ ను ట్రాప్ లోకి లాగిందని ఆమె ఆరోపించారు. తన భర్తను పెళ్లి చేసుకోవాలని వేధించిందని సుమలత ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐదు సంవత్సరాల నుంచి ఇంటికి కూడా రానివ్వకుండా బెదిరిస్తుందని ఆమె ఫిలింఛాంబర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను తన పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం ఆమెనంటూ జానీ మాస్టర్ భార్య అనసూయ ఆరోపించారు. జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను దూరం పెట్టినందునే ఈ రకమైన ఆరోపణలకు దిగిందని ఆమె ఆరోపించారు.
Next Story

