Sat Oct 12 2024 07:01:24 GMT+0000 (Coordinated Universal Time)
చిక్కుల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్.. లైంగికంగా వేధించారంటూ ఆరోపణలు
తనకు అశ్లీల వీడియోలు చూపించడం, అసభ్యకరంగా మాట్లాడటం, లైంగికంగా వేధించడం వంటి పనులు చేసేవాడని ఆమె ఆరోపించింది.
ముంబై : ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ చిక్కుల్లో పడ్డారు. కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితుడే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలోని గుడిలో బడిలో పాటలకు గణేష్ ఆచార్య కొరియోగ్రాఫీ చేశారు. ఈ పాట తర్వాత రీసెంట్ గా పుష్ప సినిమాలో 'ఊ అంటావా మామ' అనే పాటకు కూడా గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. అసలు విషయానికొస్తే.. గణేష్ ఆచార్య దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్నడ్యాన్సర్.. ఆయన తనను లైంగికంగా ఇబ్బందికి గురిచేశాడని ఆరోపించారు.
తనకు అశ్లీల వీడియోలు చూపించడం, అసభ్యకరంగా మాట్లాడటం, లైంగికంగా వేధించడం వంటి పనులు చేసేవాడని ఆమె ఆరోపించింది. ఆమె ఆరోపణల మేరకు 2020లో పోలీసులు కేసు ఫైల్ చేశారు. అప్పట్నుంచి ముంబైలోని ఓషివారా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. కేసు విచారణ అనంతరం తాజాగా కోర్టులో గణేష్ ఆచార్య పై చార్జ్ షీట్ దాఖలు చేయబడింది. గణేష్ ఆచార్య పై దాఖలు చేయబడిన ఛార్జ్ షీట్ వివరాలను పోలీసు అధికారులు వెల్లడించారు. 354-ఎ, 354-సి, 354-డి, 509, 323, 504, 506 సెక్షన్ల కింద చార్జ్ షీట్ దాఖలు చేశారు. గణేష్ మాస్టర్ తో పాటు అతడి సహాయకుడి పైన కూడా చార్జ్ షీట్ దాఖలు అయ్యింది.
Next Story