Thu Mar 19 2026 04:33:51 GMT+0530 (India Standard Time)
వరుస రోడ్డు ప్రమాదాలు. చిన్నారి మృతి, 16 మందికి గాయాలు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు..

దుబ్బాక : తెలంగాణలో మంగళవారం వరుస రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో పలువురు గాయపడగా.. ఓ చిన్నారి మృతి చెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడటంతో.. కారులో ఉన్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబాబాద్ మండలంలో జరిగిన మరో ప్రమాదంలో గేదె మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు కామారెడ్డి నుండి భద్రాచలం వెళ్తుండగా.. కంబాలపల్లి శివారులో ప్రమాదవశాత్తు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గేదె మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు ప్రమాదంలో 13 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Next Story

