Sun Mar 22 2026 11:10:41 GMT+0530 (India Standard Time)
Road Accident : అతి వేగంతో వచ్చి కారుతో ఢీకొట్టి..చార్మినార్ సీఐ మృతి
రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరంలోని చార్మినార్ సీఐ సాదిక్ ఆలీ మృతి చెందారు.

Road Accident :రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ నగరంలోని చార్మినార్ సీఐ సాదిక్ ఆలీ మృతి చెందారు. ఆయన ప్రయానిస్తున్న బైకును కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్ లో ఒక ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ పరారీ అయ్యాడు. ఈ కారుపై గతంలో ఓవర్ స్పీడ్, నిబంధనలను అతిక్రమించారన్న చలాన్లు అనేకం ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. సీఐ బైకు పై వస్తుండగా కారు వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఐకి గాయాలయ్యాయి.
ఎస్ఐకి గాయాలు...
సీఐ సాదిక్ ఆలీ మరణానికి కారణమైన కారు వినుషాశెట్టి పేరు మీద ఉందని పోలీసులు కనుగొన్నారు. సీఐ సాదిక్ ఆలీ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓవర్ స్పీడ్ తో వచ్చి ప్రమాదానికి గల కారణమైన కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కారు వదిలి పరారయిన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడమే ప్రమాదానికి కారణమని తెలిసింది.
Next Story

