Fri Apr 03 2026 09:11:47 GMT+0530 (India Standard Time)
మళ్లీ చెడ్డీ గ్యాంగ్ హల్చల్
నగరంలోకి మళ్లీ చడ్డీ గ్యాంగ్ వచ్చేసింది. హయత్ నగర్ లోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడింది.

నగరంలోకి మళ్లీ చడ్డీ గ్యాంగ్ వచ్చేసింది. హయత్ నగర్ లోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడింది. ఒక ఇంట్లో నుంచి ఏడు తులాల బంగారం, 70 తులాల వెండిని చడ్డీ గ్యాంగ్ ఎత్తుకెళ్లింది. మొత్తం ఏడు ఇళ్లల్లో చడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడుతుంది. వీరంతా అంతరాష్ట్ర దొంగల ముఠాగా పోలీసులు భావిస్తున్నారు. చడ్డీ గ్యాంగ్ లు తిరిగే దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
మూడు బృందాలు...
చడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇందుకోసం మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజాగుల్మహార్ వరస చోరీలు చేసింది. చోరీకి ముందు చడ్డీ గ్యాంగ్ రెక్కీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటిపోకుండా పోలీసులు నలుమూలలా నిఘాను విస్తృతం చేశారు.
Next Story

