Fri Dec 05 2025 17:59:19 GMT+0000 (Coordinated Universal Time)
జేబులో ఫోన్.. పిడుగు పడడంతో..!
పిడుగుపడటంతో జేబులోని సెల్ఫోన్ పేలి ఓ యువకుడు దుర్మరణం

పిడుగుపడటంతో జేబులోని సెల్ఫోన్ పేలి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం సూదవరపు జయంత్(23), మరో యువకుడితో కలిసి పాతమల్లం పేట నుంచి స్వగ్రామం వస్తుండగా జోగుంపేటలో పిడుగు పడి జయంత్ జేబులోని ఫోన్ పేలింది. దీంతో అతడు మృతి చెందాడు. అతడితో పాటూ వస్తున్న యువకుడికి గాయాలయ్యాయి. అతడికి ప్రాణాపాయం తప్పింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం బి.దొడ్డవరం గ్రామంలో పిడుగుపాటుకు భూమి కుంగిపోయింది. గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.సుబ్రహ్మణ్యస్వామి ఆలయ సమీపంలో ప్రధాన రహదారి పక్కన పిడుగులు పడ్డాయి. సోమవారం ఉదయం లేచి చూసేసరికి పిడుగు పడిన చోట భూమి కుంగిపోయిందని ఆ గ్రామ సర్పంచ్ రామశివ సుబ్రహ్మణ్యం చెప్పారు.
కాకినాడలో ఓ మహిళ పిడుగుపాటుకు మరణించింది. మండల కేంద్రమైన రౌతులపూడి గ్రామానికి చెందిన గంప సత్యవతి (26) పిడుగు పడి మృతి చెందింది. సోమవారం వ్యవసాయ పనులకు వెళ్లగా మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పిడుగు పడటంతో మతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మతురాలికి భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Next Story

