Fri Dec 05 2025 11:15:47 GMT+0000 (Coordinated Universal Time)
పబ్ లో డ్రగ్స్... సైబరాబాద్ లో కలకలం
సైబరాబాద్ పరిధిలోని ఒక పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపింది

సైబరాబాద్ పరిధిలోని ఒక పబ్ లో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటం కలకలం రేపింది. పబ్ లు డ్రగ్స్ కు అడ్డాగా మారాయనడానికి ఇది ఉదాహరణ మాత్రమే. పోలీసులు దాడులు చేస్తున్నా డ్రగ్స్ వాడకం మాత్రం ఆగడం లేదు. ప్రధానంగా గోవా, ముంబయి నుంచి తీసుకువస్తున్న డ్రగ్స్ ను హైదరాబాద్ లోని పబ్స్ లలో యువత వినియోగిస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో స్పష్టమయింది.
24 మంది...
తాజాగా జరిగిన ఘటన కూడా ఇందుకు అద్దం పడుతుంది.ఖాజాగూడ లోని ది కేవ్ పబ్ లో తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో దాడులు నిర్వహించింది. కోకైన్ తీసుకుంటు గౌరవ్ అనే యువకుడు పట్టుబడ్డాడు. ఈ పబ్ లో మొత్తం 54మందికి టెస్ట్ లు చేయగా 24మంది డ్రగ్స్ తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు.సైబరాబాద్, ఎస్ఓటి, నార్కోటిక్ జాయింట్ ఆపరేషన్ నిర్వహించిన ఈ దాడుల్లో డ్రగ్స్ బండారం బయటపడింది.
Next Story

