Sun Oct 06 2024 01:09:25 GMT+0000 (Coordinated Universal Time)
దళితబాలుడిని దారుణంగా కొట్టి.. కాళ్లు నాకించిన యువకులు
బాలుడిని బెల్టుతో కొట్టి.. ఆపై తమకాళ్లు నాకాలని నిందితులు డిమాండ్ చేశారు. ఆ బాలుడు స్థానికంగా గంజాయి అమ్ముతున్నట్లు యువకులు
ఉత్తర్ ప్రదేశ్ : దళిత బాలుడిని కొందరు యువకులు దారుణంగా కొట్టి.. తమ కాళ్లను నాకించి పైశాచికత్వాన్ని ప్రదర్శించిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో చోటుచేసుకుంది. అదంతా యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది. వీడియోలో ఉన్న బాధిత బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. అతని తల్లి నిందితుల్లో ఒకరి పొలంలో కూలీగా పనిచేస్తోంది. తన తల్లి పనికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని ఆ విద్యార్థి అడగడంతో అతనిపై కొందరు యువకులు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
బాలుడిని బెల్టుతో కొట్టి.. ఆపై తమకాళ్లు నాకాలని నిందితులు డిమాండ్ చేశారు. ఆ బాలుడు స్థానికంగా గంజాయి అమ్ముతున్నట్లు యువకులు ఆరోపించగా.. దెబ్బలు తట్టుకోలేక యువకులు చేసిన ఆరోపణలను బాలుడు అంగీకరించాడు. ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అయింది. వీడియో చూసిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాలుడు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా.. వెంటనే నిందితులను అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.
Next Story