Sun Jun 22 2025 11:52:11 GMT+0000 (Coordinated Universal Time)
Murder Plan : పక్కా ప్లాన్ తో మర్డర్ స్కెచ్...ఇద్దరూ కలసి ఎంత డ్రామాలాడారో తెలిస్తే?
మేఘాలయలో జరిగిన నవ దంపతుల మాయమైన కేసు అనేక మలుపులు తిరుగుతుంది.

మేఘాలయలో జరిగిన నవ దంపతుల మాయమైన కేసు అనేక మలుపులు తిరుగుతుంది. ఈ కేసులో భర్ రఘువంశీని భార్య సోనమ్ ను చంపిన విషయాన్ని నిర్ధారణకు వచ్చిన పోలీసులు పెళ్లయిన వారం రోజులకే హత్య చేయించడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటికే సోనమ్ తో పాటు హత్యలో పాల్గొన్న మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు కిరాయి హంతకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సోనమ్ తనకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంది. పెద్దలను ఒప్పించలేనని భావించి బలవంతంగా రఘువంశీతో పెళ్లికి అంగీకరించింది. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత రఘువంశీని తొలగించుకుని, తర్వాత తాను వితంతువుగా మారి తన ప్రియుడు రాజ్ కుశ్వాహతో వివాహం చేసుకోవచ్చని, అప్పుడయితే ఇంట్లో పెద్దలు అంగీకరిస్తారని సోనమ్ ఈ స్కెచ్ వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది.
అంతా చేసింది ఆమే...
మధ్యప్రదేశ్ నుంచి మేఘాలయకు హనీమూన్ కు వెళ్లాలని సోనమ్ ప్రతిపాదించింది. అందుకు అవసరమైన ప్రయాణ టిక్కెట్లతో పాటు అక్కడ ఉండేందుకు వసతికి సంబంధించి కూడా ఆన్ లైన్ లో సోనమ్ బుక్ చేసినట్లు పోలీసుల విచారణలో కనుగొన్నారు. ముందుగా మాట్లాడి ఉంచుకున్న కిరాయి హంతకులను ముగ్గురికి తాము ఎక్కడకు వెళుతుంది? ఎక్కడ బస చేస్తుంది? అన్న వివరాలను ఫోన్ లోనే సమాచారం అందించింది. తన ప్రియుడు రాజ్ కుశ్వాహను వివాహం చేసుకోవాలన్న కారణంతోనే పెళ్లి చేసుకున్న భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది. అందుకు అనుగుణంగానే భర్త రఘువంశీని నమ్మించి మాయమాటలు చెప్పి హనీమూన్ కు తీసుకెళ్లి హత్య చేయించిందని పోలీసులు తెలిపారు.
ప్రియుడిది పెద్ద డ్రామా...
ఇక సోనమ్ ప్రియుడు రాజ్ కుశ్వాహ కూడా పెద్ద డ్రామానే ఆడారు. రఘువంశీ మృతదేహాన్ని మేఘాలయ నుంచి ఇంటికి తీసుకు వచ్చే సమయంలో అక్కడ రరఘువంశీ ఉన్నట్లు గుర్తించారు. రఘువంశీ మృతదేహాన్ని తీసుకు వస్తున్న వాహనాల్లో ఒకదానిని రాజ్ కుశ్వాహ స్వయంగా డ్రైవ్ చేశాడని, సోనమ్ తండ్రిని కూడా జరిగిన ఘటనపై ఓదార్చాడని కూడా చెబుతున్నారు. ఇక తర్వాత రఘువంశీ అంత్యక్రియల్లోనూ రాజ్ కుశ్వాహ పాల్గొని ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. ఇలా సోనమ్ తో పాటు రాజ్ కుశ్వాహ పక్కా ప్లాన్ తో మర్డర్ చేసి మరీ తప్పించుకనేందుకు వేసిన స్కెచ్ ను పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించగలిగారు.
Next Story