Wed Mar 18 2026 03:49:46 GMT+0530 (India Standard Time)
Pushpa : "పుష్ప" నటుడి అరెస్ట్.. బెదిరింపులకు దిగడంతో
పుష్పలో నించిన జగదీశ్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. అతనిని అరెస్ట్ చేశారు

పుష్పలో నించిన జగదీశ్ పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. సోషల్ మీడియాలో బెదిరింపులకు దిగుతున్నాడని జగదీశ్ పై ఈ కేసు నమోదు చేశారు. జూనియర్ ఆర్టిస్ట్ మరో వ్యక్తితో ఉన్నప్పడు తీసిన ఫొటోలను తాను షేర్ చేస్తానని బెదిరించడంతో కేసు నమోదయింది. అరెస్ట్ చేసిన అనంతరం జగదీశ్ ను కోర్టులో హాజరుపర్చారు.
తప్పించుకుని తిరుగుతూ...
గత నెల 27వ తేదీన ఒక మహిళకు తెలియకుండా ఫొటోలు తీసి జగదీశ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ మహిళ గత నెల 29వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం జగదీశ్ అని తేల్చారు. దీంతో అతనిని అరెస్ట్ చేశారు. చాలా రోజుల నుంచి జగదీశ్ తప్పించుకుతిరుగుతున్నారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పక్కన నటుడిగా పనిచేశారు.
Next Story

