Wed Mar 18 2026 15:16:10 GMT+0530 (India Standard Time)
వైసీపీ నేత సజ్జల కుమారుడి అరెస్ట్‌కు రంగం సిద్ధం
వైసీపీ నేత సజ్జల రామకృష్నారెడ్డి కుమారుడు భార్గవ్ పై కేసు నమోదైంది.

వైసీపీ నేత సజ్జల రామకృష్నారెడ్డి కుమారుడు భార్గవ్ పై కేసు నమోదైంది.అధికార పార్టీ నేతలే టార్గెట్‌గా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలతో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయినట్లు తెలిసింది.
భార్గవ్ పై కేసు నమోదు...
సజ్జల భార్గవ్ గతంలో వైసీపీ సోషల్ మీడియాకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన పై కేసు నమోదు చేసిన పోలీసులు సజ్జల భార్గవ రెడ్డిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు సజ్జల భార్గవ రెడ్డి అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు తమ న్యాయవాదులను రంగం సిద్ధం చేశారు.
Next Story

