Wed Jan 28 2026 09:02:36 GMT+0000 (Coordinated Universal Time)
ఆమెకు అసభ్యకరమైన మేసేజ్ లు, ఫోటోలు పంపుతున్న ఎస్పీ
తెలంగాణ రాష్ట్రంలో సీఐడీ విభాగంలో ఎస్పీ ర్యాంకులో పనిచేస్తున్న కిషన్ సింగ్ పై

తెలంగాణ రాష్ట్రంలో సీఐడీ విభాగంలో ఎస్పీ ర్యాంకులో పనిచేస్తున్న కిషన్ సింగ్ పై కేసు నమోదైంది. ఓ మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో టీఎస్పీఎస్పీడీసీఎల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి సీఐడీ ఎస్పీపై ఫిర్యాదు చేసింది. తన ఫోన్ కు సీఐడీ ఎస్పీ అసభ్యకరమైన మేసేజ్ లు, ఫోటోలు పంపుతున్నారని మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై హైదరాబాద్ చైతన్యపురి పోలీసులు విచారణ నిర్వహించి కేసు నమోదు చేశారు.
సరూర్ నగర్ స్టేడియం లో నేషనల్ కాంపిటీషన్స్ కు ప్రిపేర్ అవుతున్న ఉద్యోగినిని కిషన్ సింగ్ ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాను స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్న వాటిలో పాల్గొనాలంటూ మహిళా ఉద్యోగినికి చెప్పాడు అతడు. ఆ తరువాత మహిళ ఫోన్ నంబర్ తీసుకుని తరచూ ఆమెకు అభ్యంతరకర మెసేజ్ లు, ఫోటోలు, వీడియోలు పంపిస్తూ వచ్చాడు. శారీలో నిన్ను చూడాలని ఉంది, నీ ఫోటోలు పంపు అంటూ తరచూ వేధింపులు ఎదురయ్యేవి. తనకు సహకరించాలంటూ వేధింపులకు దిగాడు. ఇక వేధింపులను తట్టుకోలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది.
Next Story

