Fri Mar 20 2026 08:22:27 GMT+0530 (India Standard Time)
AP MLC : రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీకు తీవ్రగాయాలు
నెల్లూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది

Mlc parvartha reddy :నెల్లూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. నిన్న అర్థరాత్రి నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలిక సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనింది. దీంతో ఎమ్మెల్సీ కారులో ఉన్న పీఏ అక్కడికక్కడే మరణించారు.
విజయవాడ నుంచి నెల్లూరుకు...
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విజయవాడ నుంచి నెల్లూరు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్సీ కారుకు ముందు వెళుతున్న లారీ టైరు పంక్చరు కావడంతో ఒక్కసారిగా ఆగింది . ఆ క్రమంలో కారు వెళ్లి లారీ వెనుక భాగంలో ఢీకొని డివైడర్‌పై పడిపోయింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌రెడ్డి పీఏ అక్కడికక్కడే మృతి చెందగా, ఎమ్మెల్సీ తలకు గాయాలయ్యాయి... ప్రమాద సమయంలో కారులో అయిదుగురు ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిని వెంటనే నెల్లూరులోని అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story

