Fri Dec 19 2025 02:27:45 GMT+0000 (Coordinated Universal Time)
కూలీల ఆటో ఢీ కొట్టిన కారు.. 14 మందికి తీవ్రగాయాలు
స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో ..

మచిలీపట్నం : వ్యవసాయ కూలీలతో వెళ్తోన్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటన కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం - విజయవాడ జాతీయ రహదారి గూడూరు మండలం పర్ణశాల గ్రామం వద్ద జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీ కొట్టడంతో.. ఆటోలో ప్రయాణిస్తున్న 14 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడలోని ఆంధ్రా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులంతా మచిలీపట్నంలోని గిలకలదిండి ప్రాంతానికి చెందిన మహిళలుగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న మంత్రి పేర్ని నాని తనయుడు, వైసీపీ యువనేత పేర్ని కిట్టు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారిని పరామర్శించారు.
Next Story

