Sun Mar 08 2026 04:09:13 GMT+0530 (India Standard Time)
మాదాపూర్ లో కారు బీభత్సం...ఒకరు మృతి
మాదాపూర్ లో కారు బీభత్సం సృష్టించింది. పాల వ్యాపారులపైకి కారు దూసుకెళ్లింది. దీంతో ఒక వ్యక్తి మరణించాడు.

మాదాపూర్ లో కారు బీభత్సం సృష్టించింది. పాల వ్యాపారులపైకి కారు దూసుకెళ్లింది. దీంతో ఒక వ్యక్తి మరణించాడు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిని...
మృతుడు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. అతి వేగంగా వచ్చిన కారు పాల వ్యాపారులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లడంతో కారు చక్రాల కింద పడి ఒకరు అక్కడికక్కడే మరణించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఎవరిది? అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Next Story

