Thu Mar 05 2026 02:52:36 GMT+0530 (India Standard Time)
కారు బీభత్సం.. నలుగురు మృతి
కరీంనగర్ జిల్లాలో కారు బీభత్సం సృష్టిించింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడకక్కడే మృతి చెందారు.

కరీంనగర్ జిల్లాలో కారు బీభత్సం సృష్టిించింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు అక్కడకక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ పట్టణంలోని కమాన్ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఒక కారు రోడ్డు పక్కన ఉన్న గుడెసెలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నిద్రిస్తున్న మహిళలు నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు.
నిద్రిస్తున్న వారు....
అయితే ప్రమాదానికి కారణమయిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కారులో కొందరు పరారయినట్లు చెబుతున్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదానికి కారణం ఓవర్ స్పీడ్ అని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

