Tue Mar 17 2026 13:27:25 GMT+0530 (India Standard Time)
జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం
జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ ను ఢీకొట్టింది. ఒక యువతి కారును డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు.

వీకెండ్ వస్తే చాలు యువత మద్యం సేవించి వాహనాలను నడుపుతూ ప్రాణాలు తీస్తున్నారు. కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. శని, ఆదివారాల్లో ఎక్కువగా మద్యం సేవించి వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. తాజాగా జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ ను ఢీకొట్టింది. ఒక యువతి కారును డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించారు.
యువతీ యువకులు...
కారులో యువతీ, యువకులు ఉండటంతో ఒక్కసారి కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఏం జరిగిందోనని భయపడి కారులో నుంచి దూకి పరారయ్యారు. కారు ఎవరిది? ఎవరు నడుపుతున్నారు? అన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో వీకెండ్ పార్టీలు తెల్లవారుజాము వరకూ జరుగుతుండటం వల్లనే ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.
- Tags
- car
- jubilee hills
Next Story

