Thu Mar 19 2026 05:24:13 GMT+0530 (India Standard Time)
అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లింగ్
స్మగ్లర్లు తమకు అనువైన మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అల్లూరి జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ కలకలం..

గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల స్మగ్లింగ్ పై పోలీస్ యంత్రాంగం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. స్మగ్లర్లు తమకు అనువైన మార్గాల్లో స్మగ్లింగ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ కలకలం రేపింది. అరకు ఘాట్ రోడ్డులో గంజాయి తరలిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
cప్రమాదంపై పోలీసులకు సమాచారం అందగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ కారులో 6 బస్తాల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. కారుకి ప్రమాదం జరగడంతో స్మగ్లర్లు కారుని అక్కడే వదిలేసి పరారయ్యారు. కారు నంబరు ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని చుట్టుపక్కల ప్రజలను అలర్ట్ చేశారు.
Next Story

