Sat Dec 07 2024 01:51:07 GMT+0000 (Coordinated Universal Time)
ప్రేమజంటపై గంజాయి బ్యాచ్ దాడి
యువతి బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా.. యువతిపై నిందితుడు చేస్తున్న దారుణం కనిపించింది.
ప్రేమజంటపై గంజాయి బ్యాచ్ దాడికి పాల్పడింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలోని ముస్తాబాద్ లో చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న ప్రేమజంటను ఆటోలో వెంబడించి.. యువతిపై అత్యాచారానికి యత్నించారు. వివరాల్లోకి వెళ్తే.. ముస్తాబాద్ లో ఓ ప్రేమజంట నిర్మానుష్య ప్రదేశానికి వెళ్తుండగా.. గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకులు వారిని ఆటోలో వెంబడించారు. యువకుడిని తాళ్లతో బంధించి.. యువతిపై అఘాయిత్యానికి యత్నించారు.
అంతలో.. యువతి బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా.. యువతిపై నిందితుడు చేస్తున్న దారుణం కనిపించింది. వెంటనే వారిని స్థానికులు పట్టుకుని యువతిని రక్షించారు. నిందితుల్లో ఒకడు పట్టుబడగా.. మరొకడు పరారయ్యాడు. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి..పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Next Story