Thu Mar 19 2026 05:50:31 GMT+0530 (India Standard Time)
లోయలోపడిన బస్సు : 13 మంది మృతి
పూనే పాత జాతీయ రహదారిపై తెల్లవారుజామున రెండు వందల అడుగుల లోయలో ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ

పూనే పాత జాతీయ రహదారిపై తెల్లవారుజామున రెండు వందల అడుగుల లోయలో ఒక ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులున్నారని తెలిసింది. . ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. ఇప్పటి వరకు పదమూడు మంది మృతి చెందినట్లు తెలిసింది.
అదుపుతప్పి...
సుమారు 25 మందికి గాయాల పాలయినట్లు చెబుతున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మంరింత పెరిగే అవకాశముంది. పోలీసులు, సహాయక బృందాలు సంఘటన స్థలికి సహాయక చర్యలు ప్రారంభించాయి. నిద్రమత్తులో అతివేగంగా బస్సును నడపటం వల్లనే బస్సు లోయలో పడిందని పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

