Thu Mar 19 2026 03:01:08 GMT+0530 (India Standard Time)
ప్రైవేట్ బస్సు బోల్తా పడి 20 మందికి గాయాలు
హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది గాయపడ్డారు.

హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది గాయపడ్డారు. నల్గొండ జిల్లా కేంద్రంలో హైదరాబాద్ రోడ్డు చంద్రగిరి విల్లాస్ కాలనీకి వెళ్లే దారి వద్ద శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతి వేగమేనని బస్సులో ప్రయాణికులు చెబుతున్నారు.
ఇద్దరి పరిస్థితి విషమం...
గాయపడిన వారిని వెంటనే స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. రోడ్డుపై అడ్డంగా పెట్టిన బారికేడ్లను తప్పించబోయి బస్సు పల్టీ కొట్టిందని చెబుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
Next Story

