Wed Mar 18 2026 21:47:54 GMT+0530 (India Standard Time)
కోట్ల నగదు... కట్టలు కట్టి మరీ.. పట్టేసుకున్న ఈడీ
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాల్లో కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి

ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల సోదాల్లో కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి. అక్రమ మైనింగ్ వ్యవహారంలో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో భారీగా నగదుతో పాటు ఆయుధాలు కూడా దొరకడం విశేషం. అదీ ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఇవి దొరకడం విశేషం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలోని ఇరవై ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు.
మాజీ ఎమ్మెల్యే ఇంట్లో...
ఈ దాడుల్లో మాజీ ఎమ్మెల్యే దిల్ బాగ్ సింగ్ నివాసంలో ఐదు కేజీల బంగారంతో పాటు ఐదు కోట్ల రూపాయల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు విదేశాల నుంచి అక్రమంగా తీసుకు వచ్చిన ఆయుధాలను కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కాంగ్రెస్ ఎమ్మెలయే సురీందర్ పన్వర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.
Next Story

