Sun Dec 14 2025 11:26:41 GMT+0000 (Coordinated Universal Time)
నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఇద్దరు మృతి
కోల్కతా లో భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు

కోల్కత్తా లో భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. శిధిలాల కింద పది మంది చిక్కుకున్నారు. కోల్కత్తాలోని గార్డెన్ రీచ్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఐదు అంతస్థుల భవనం కూలిపోయింది. భవనం చుట్టూ పేదలు గుడిసెలు నిర్మించుకుని ఉన్నారు. ఇళ్లపై పడటంతో గుడెసెల్లో ఉన్న వారంతా భవనాల శిధిలాల కింద చిక్కుకున్నారు.
పది మందిలో...
ఇప్పటి వరకూ ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించినట్లు తెలిసింది. మొత్తం పది మంది శిధిలాల కింద చిక్కుకోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. శిధిలాలను తొలగించి సహాయక చర్యలను సిబ్బంది ప్రారంభించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. బల్డర్ కోసం పోలీసులు వెదుకుతున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

