Sat Dec 06 2025 02:10:51 GMT+0000 (Coordinated Universal Time)
విషాదం.. కాలేజీ ఫీజు కట్టలేక విద్యార్థిని బలవన్మరణం
అచ్యుతాపురం మండలంలోని మళ్లవరం గ్రామానికి చెందిన కర్రి ధనలక్మ్షి బీఎస్సీ నర్సింగ్ చేయాలని అనుకుంది. ఆ దిశగానే చదువుతూ..

ప్రేమ విఫలమైందని, చదువు ఒత్తిడి తట్టుకోలేక, ప్రేమలో మోసపోయామని బలవంతంగా ప్రాణాలు తీసుకున్న వారెందరో ఉన్నారు. కానీ ఓ విద్యార్థిని.. తన చదువుకు కాలేజీలో ఫీజు కట్టలేని కారణంగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం మళ్లవరంలో జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. అచ్యుతాపురం మండలంలోని మళ్లవరం గ్రామానికి చెందిన కర్రి ధనలక్మ్షి బీఎస్సీ నర్సింగ్ చేయాలని అనుకుంది. ఆ దిశగానే చదువుతూ వచ్చింది. ప్రస్తుతం అచ్యుతాపురంలోని ఓ నర్సింగ్ కళాశాలలో ఎంపిహెచ్ డబ్ల్యూ కోర్సు చదువుతోంది. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి కూతురి చదువుకి అడ్డంకిగా మారింది. కాలేజీ ఫీజు కట్టాలని తల్లిదండ్రులను అడగ్గా.. తాము కట్టలేమని చదువు మానేయాలని మందలించారు. దాంతో ఇక తనకు చదువుకునే యోగం లేదని, తాను కలలు కన్న బీఎస్సీ నర్సింగ్ పట్టా అందుకోలేనని భావించి.. ఇంట్లో ఉన్న చీమల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ ధనలక్మ్షి మృతి చెందింది.
Next Story

