Sat Dec 06 2025 16:30:19 GMT+0000 (Coordinated Universal Time)
Neloore : నెల్లూరులో దారుణం.. ప్రేమించలేదని యువతి హత్య
నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఒక యువకుడు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన జరిగింది

నెల్లూరులో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదని ఒక యువకుడు కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన జరిగింది. నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైథిలి దారుణ హత్యకు గురయింది. బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న మైథిలిని తన రూమ్ కు పిలిచి కత్తితో పొడిచి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. మైథిలీతో మాట్లాడాలని తన రూముకు పిలిపించుకుని హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మైధిలి కుటుంబ సభ్యులు కూడా నిఖిల్ అనే యువకుడు హత్య చేసినట్లు చెబుతున్నారు.
రూముకు పిలిపించి...
నిఖిల్ మైధిలిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. అయితే మైథిలి మాత్రం అతని ప్రేమను నిరాకరించింది. దీంతో కసి పెంచుకున్న నిఖిల్ అనే యువకుడు మైథిలిని దారుణంగా హత్య చేసి కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలియచేశాడు.దీంతో పోలీసులు సంఘటన స్థలికిచేరుకుని విచారణ ప్రారంభిస్తున్నారు. మైథిలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు నిఖిల్ పరారీ లో ఉన్నట్లు తెలిసింది.
Next Story

