Sun Mar 26 2023 10:05:03 GMT+0000 (Coordinated Universal Time)
రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మృతి
ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత అర్జున్ చరణ్ దాస్ మరణించారు

ఒడిశాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత అర్జున్ చరణ్ దాస్ మరణించారు. ఆయన జాజ్పూర్ జిల్లాలో బింజర్పూర్ నియోజవర్గ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇటీవలే హైదరాబాద్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. విలేకర్ల సమావేశంలో మాట్లాడేందుకు వెళుతుండగా ఆయన వాహనాన్ని ట్రక్కు ఢీకొట్టడంతో ఆయన మరణించారు.
కేసీఆర్ సంతాపం....
ఖరస్రోటా వంతనపై ట్రక్కు మాజీ ఎమ్మెల్యే అర్జున్ చరణ్ దాస్ ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. వాహనంపై ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి కూడా తీవ్ర గాయాలపాలయినట్లు చెబుతున్నారు. అర్జున్ చరణ్ దాస్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపాన్ని ప్రకటించారు. జాజ్పూర్ నుంచి భువనేశ్వర్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
Next Story